Indian Test Players: భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచే వార్త. ఈ ఏడాది ఐదుగురు స్టార్ క్రికెటర్లు (Indian Test Players) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 24, 2025న తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో గొప్ప పేరున్న పుజారా 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశాడు. 2025లో రిటైర్ అయిన ఐదుగురు భారత క్రికెటర్లలో పుజారా ఒకడు.
ఈ ఏడాది రిటైర్ అయిన ఐదుగురు క్రికెటర్లు వీరే
- చతేశ్వర్ పుజారా: 103 టెస్ట్ మ్యాచ్‌లలో 7,195 పరుగులు చేసి తన కెరీర్‌కు ముగింపు పలికాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అంకితభావం, నిలకడ ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.
- రోహిత్ శర్మ: ఐపీఎల్ 2025 సమయంలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా టెస్టుల్లో ఎన్నో విజయాలను అందించిన రోహిత్ 67 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
- విరాట్ కోహ్లీ: రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. అతను 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
- వరుణ్ ఆరోన్: వేగవంతమైన బౌలర్‌గా పేరున్న వరుణ్ ఆరోన్ జనవరి 10, 2025న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అతను భారత్ తరపున 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
- వృద్దిమాన్ సాహా: అత్యుత్తమ వికెట్ కీపర్‌లలో ఒకడైన వృద్దిమాన్ సాహా ఫిబ్రవరి 1, 2025న రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 40 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: They Call Him OG: ఓజీ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్.. ఈనెల 27న అంటూ ట్వీట్!
100కు పైగా టెస్టులు ఆడిన ఇద్దరు క్రికెటర్లు
ఈ ఏడాది టెస్టుల నుంచి రిటైర్ అయిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వారు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా ఉన్నారు. విరాట్ కోహ్లీ 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చతేశ్వర్ పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ (67 టెస్టులు), వరుణ్ ఆరోన్ (9 టెస్టులు), వృద్దిమాన్ సాహా (40 టెస్టులు) తమ కెరీర్‌కు ముగింపు పలికారు. ఈ ఐదుగురు ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లయింది.