Site icon HashtagU Telugu

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో టాప్ 5 ఆటగాళ్లు వీళ్ళే

T20 World Cup

T20 World Cup

T20 World Cup: టీ20 ఫార్మేట్ అంటేనే బ్యాటర్లు స్వర్గధామంగా భావిస్తారు. 20 ఓవర్ల టి20 ఫార్మెట్లో బ్యాట్స్ మేన్స్ ధనాధన్ బ్యాటింగ్ తో బౌలర్లను ఉతికారేస్తారు. ఈ ఫార్మెట్లో బ్యాటర్లు అనేక రికార్డులు బద్దలు కొడతారు.జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు వెస్టిండీస్ మరియు అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాట్స్‌మెన్ల గురించి ఓ లుక్కేద్దాం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 27 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 1141 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. విశేషం ఏంటంటే ఈ టోర్నీలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. బట్ 14 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడి 963 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. టోర్నీలో అతని అత్యధిక స్కోరు 79 నాటౌట్. ఈ టోర్నీలో 31 మ్యాచ్‌లు ఆడి 593 పరుగులు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. యువీ 4 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ టోర్నీలో యువరాజ్ అత్యధిక స్కోరు 70. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 33 మ్యాచ్‌ల్లో 529 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.ధోనీ అత్యధిక స్కోరు 45 పరుగులు మాత్రమే. 2011 ప్రపంచకప్ హీరో, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ టి20 ప్రపంచకప్ చరిత్రలో 21 మ్యాచ్‌లు ఆడి 524 పరుగులు సాధించాడు.గంభీర్ తన కెరీర్లో 4 అర్ధ సెంచరీలు నెలకొల్పాడు.

Also Read: T20 World Cup 2024: కీపర్ విషయంలో రోహిత్ శర్మ సందిగ్ధత