Josh Hazlewood: ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుంది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేస్తున్నాయి. అంతర్జాతీయ టోర్నీలలో ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా జట్ల ఓనర్లు ఓ కన్నేసి ఉంచారు. కొందరు రాణిస్తుండగా మరికొందరు బ్యాడ్ ఫామ్ తో టెన్షన్ పెడుతున్నారు. మరోవైపు ఆటగాళ్ల గాయాల బెడద పట్టుకుంది.
17 సీజన్లు గడిచినా.. ఒక్క టైటిల్ నోచుకోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్లో హాట్ ఫెవరెట్ గానే బరిలోకి దిగుతుంది. గడిచిన సీజన్లో అద్భుతంగా రాణించి టైటిల్ వేటలో పోటీ పడింది. కానీ అదృష్టం కలిసి రాక చివర్లో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) జట్టుకు తలనొప్పిగా మారాడు. మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ని 12.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి ముందు కూడా అతను ఐపీఎల్‌లో ఆర్‌సిబి తరపున ఆడాడు. కానీ వచ్చే సీజన్లో హాజిల్‌వుడ్ ఆడటం కష్టంగానే కనిపిస్తుంది. ఇదే జరిగితే ఆర్సీబీ దెబ్బ ఎదురుదెబ్బ తగిలినట్లే అవుతుంది.
Also Read: Harshit Rana: రోహిత్ సలహా ఫలించింది.. రాణా కామెంట్స్ వైరల్!
ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. హాజెల్‌వుడ్ ఇంకా ఫిట్‌గా లేడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా నిష్క్రమించే అవకాశం ఉంది. జోష్ హాజిల్‌వుడ్ 2020 నుండి 2023 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా గాయపడ్డాడు. అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలగొచన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమ్మిన్స్ కాలి గాయంతో బాధపడుతున్నాడని, దీంతో ఐసిసి టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లేదని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించారు. ఇదే జరిగితే ఆస్ట్రేలియాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.