Leicestershire: బూమ్రా బౌలింగ్ X రోహిత్ బ్యాటింగ్

ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత టెస్ట్ మ్యాచ్ కు సన్నద్ధవుతోంది.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 07:30 PM IST

ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత టెస్ట్ మ్యాచ్ కు సన్నద్ధవుతోంది. సన్నహాకాల్లో భాగంగా లీస్టర్ షైర్ తో వార్మప్ మ్యాచ్ లో తలపడుతోంది. ఈ మ్యాచ్ కు ప్రత్యేకత వుంది. లీసెస్ట‌ర్‌షైర్ టీమ్ కు న‌లుగురు ఇండియ‌న్ ఆట‌గాళ్లు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. టెస్ట్ స్పెష‌లిస్ట్ ఛ‌టేశ్వ‌ర్ పుజారా, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ తో పాటు పేస‌ర్లు బుమ్రా, ప్ర‌సిద్ధ్ కృష్ణ ఈ లీసెస్ట‌ర్ షైర్ టీమ్ నుండి బరిలోకి దిగారు. భార‌త ఆట‌గాళ్లు ఆ జట్టు తరపున ఆడేందుకు బీసీసీఐతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంగీక‌రించాయి. టెస్ట్ సీరీస్ కు ముందు ఆటగాళ్ళ అందరికీ ప్రాక్టీస్ కావాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మొదట చేస్తున్న భారత్ ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కేప్టెన్ రోహిత్ శర్మ 25 పరుగులు చేశాడు. లీసెస్టర్‌షైర్ తరఫున బౌలింగ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా ప్రారంభించాడు. బుమ్రా బౌలింగ్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

తొలి సెషన్‌లో అయిదు ఓవర్లు సంధించిన బుమ్రా 20 పరుగులు ఇచ్చుకున్నాడు. వికెట్లేమీ తీసుకోలేదు. విల్ డేవిస్, రోమన్ వాకర్ తలో వికెట్ పంచుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా నాలుగు ఓవర్లల్లో తొమ్మిది పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇదిలా ఉంటే గత ఏడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ ఇప్పుడు నిర్వహించబోతున్నారు.జూలై 1 నుంచీ మొదలు కానున్న ఈ మ్యాచ్ కు బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సీరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో కొసాగుతోంది. కాగా గ‌త ఏడాదితో పోలిస్తే ఐదో టెస్ట్‌లో చాలా మార్పులు జ‌రిగాయి. 2021లో ఈ సిరీస్ కు టీమ్ ఇండియాకు కోహ్లి కెప్టెన్‌గా ఉండ‌గా ఇప్పుడు రోహిత్ శ‌ర్మ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో జోరూట్ స్థానంలో బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా నియ‌మితుడ‌య్యాడు.