Site icon HashtagU Telugu

World Cup 2023 : దటీజ్ విరాట్ కోహ్లీ.. వ్యూయర్ షిప్ లో హాట్ స్టార్ నయా రికార్డు

World Cup 2023 (82)

World Cup 2023 (82)

ఆడుతోంది ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో…అందులోనూ బర్త్ డే…ఫామ్ లో ఉన్నాడు…ఫాన్స్ అంతా సచిన్ రికార్డును సమం చేసే క్షణం కోసం ఎదురు చూస్తున్నారు…ఇక రికార్డులు బద్దలవకుండా ఉంటాయా…సెంచరీ తో కోహ్లీ ఆన్ ది ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్ లోనూ రికార్డులు బ్రేక్ చేశాడు. కోహ్లీ సెంచరీ దెబ్బకు సఫారీ టీమ్ చిత్తు చిత్తుగా ఓడిపోతే…బ్రాడ్ కాస్టర్ హాట్ స్టార్ పంట పండింది. హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూయర్ షిప్ సైతం అమాంతం పెరిగింది. ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.
కోహ్లీ సెంచరీ పూర్తి చేసినప్పుడు 4.4 కోట్ల మంది వీక్షించారు. డిజిటల్ హిస్టరీలో ఇది కొత్త రికార్డు. ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 95 పరుగులతో ఉన్నప్పుడు 4.3 కోట్ల మంది చూశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా తాజాగా అది బద్దలయ్యింది. కాగా సెంచరీ పూర్తి చేసినప్పుడు విరాట్ కోహ్లీకి ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్‌తో పాటు సెల్యూల్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే కోహ్లీ రికార్డు సెంచరీ నేపథ్యంలో ప్రేక్షకుల అరుపులతో క్రికెట్ మక్కా.. ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లింది. 118 డెసిబుల్స్ సౌండ్ వచ్చింది. ఈ ప్రపంచకప్‌లో ఇంత శబ్దంతో అభిమానులు అరవడం ఇదే తొలిసారి. కాగా సఫారీ ఛాలెంజ్ లో భారత్ దే పై చేయిగా నిలిచింది. అది కూడా మామూలు విజయం కాదు… గుర్తుండిపోయే విజయం…ఫామ్ లో ఉన్న టీమ్ ను చిత్తు చిత్తుగా ఓడించిన వేళ ఫాన్స్ మరిచిపోలేని విజయం ఆస్వాదించారు. వన్డే ప్రపంచ కప్ లో భారత్ అప్రహిత జైత్రయాత్ర కొనసాగిన వేళ వరుసగా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది.

Also Read:  World Cup 2023 : విజృంభించిన భార‌త్ బౌల‌ర్లు.. 243 ప‌రుగుల తేడాతో సౌతాఫిక్రాపై ఘ‌న విజ‌యం