IPL Mega Auction: వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిబంధలు మారాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) రిటెన్షన్ పాలసీ నిబంధనలను ప్రకటించింది. తద్వారా ఫ్రాంచైజీలు 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. దీంతో పాటు ఈ సారి చాలా మంది స్టార్ ప్లేయర్లు మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) పేరు ప్రధానంగా వినిపిస్తుంది.
బ్రూక్ ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉండటమే కారణం. హ్యారీ బ్రూక్ 2023 ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. కానీ ఆ సీజన్లో బ్రూక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే 2024 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని 4 కోట్లకు దక్కించుకుంది. అయితే బ్రూక్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ సారి మెగా వేలంలో అతనికి మంచి ధర లభిస్తుందని భావిస్తున్నారు. ఈ మూడు జట్లు హ్యారీ బ్రూక్‌ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి.
మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గ్లెన్ మాక్స్‌వెల్ మరియు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌లను విడుదల చేస్తే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆటగాడు అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిలో హ్యారీ బ్రూక్ ఆర్సీబీకి గొప్ప ఎంపికగా మారవచ్చు. అతని దూకుడు బ్యాటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌కు బలం చేకూరుస్తుంది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు కూడా హ్యారీ బ్రూక్ కోసం పోటీ పడుతుంది. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే అతను శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఓపెనర్‌గా నిరూపించుకోగలడు.
ఇటీవల ఈ స్టార్ అటగాడు ఆస్ట్రేలియాపై ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో మనం చూశాం. ఈ నేపథ్యంలో జిటి అతడి కోసం భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాలనుకుంటుంది. మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చూడొచ్చు. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తర్వాత జట్టుకు కొత్త కెప్టెన్ తో పాటు భారీ హిట్టర్లు పంజాబ్ లో భాగం కానున్నారు . రికీ పాంటింగ్ కోచ్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ యువ ప్రతిభపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. అటువంటి పరిస్థితిలో హ్యారీ బ్రూక్ జట్టుకు మంచి ఎంపిక కావచ్చు.
Also Read: CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు