IPL 2025: హిట్ మ్యాన్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు, రోహిత్ కోసం పోటీపడే జట్లు ఇవే

రోహిత్ శర్మ కోసం ప్రయత్నిస్తున్న మరో టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్... ప్రస్తుత సారథి రిషబ్ పంత్ ఆ జట్టును వీడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో రోహిత్ ను తీసుకోవడం కోసం వేలంలో గట్టిగానే ట్రై చేస్తుంది. ఓపెనర్ గానూ, సారథిగా హిట్ మ్యాన్ కు తిరుగులేని రికార్డుండడంతో ఢిల్లీ టైటిల్ కల నెరవేరుస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.

IPL 2025: ఐపీఎల్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఫ్రాంచైజీని వీడనున్నాడన్న వార్తల నేపథ్యంలో పలు టీమ్స్ అతనిపై కన్నేశాయి. సారథిగా ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన హిట్ మ్యాన్ కోసం మెగావేలంలో గట్టిపోటీ ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు రోహిత్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాయని అంచనా వేస్తున్నారు. రోహిత్ కోసం బాగా ఆసక్తిగా ఉన్న టీమ్స్ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ ముందుందని చెప్పొచ్చు. 2022లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో ఈ ఏడాది ఏడో స్థానంలో నిలిచింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ కారణంగానే రాహుల్ తో ఆ ఫ్రాంచైజీ ఓనర్ గోయెంకాకు విభేదాలు వచ్చినట్టు వార్తలు వినిపించాయి. దీంతో కొత్త కెప్టెన్ వేటలో పడిన లక్నో రోహిత్ కోసం ప్రయత్నిస్తోంది. రాహుల్ జట్టును వీడితే అతని స్థానంలో కెప్టెన్ గానూ, ఓపెనర్ గానూ రోహిత్ లక్నోకు మేజర్ అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

రోహిత్ శర్మ కోసం ప్రయత్నిస్తున్న మరో టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్… ప్రస్తుత సారథి రిషబ్ పంత్ ఆ జట్టును వీడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో రోహిత్ ను తీసుకోవడం కోసం వేలంలో గట్టిగానే ట్రై చేస్తుంది. ఓపెనర్ గానూ, సారథిగా హిట్ మ్యాన్ కు తిరుగులేని రికార్డుండడంతో ఢిల్లీ టైటిల్ కల నెరవేరుస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.
ఇక పంజాబ్ కింగ్స్ కూడా రోహిత్ శర్మపై కన్నేసినట్టు సమాచారం. ఇప్పటి వరకూ టైటిల్ గెలవని పంజాబ్ కు ప్రతీ సీజన్ లో సరైన సారథ్య లోపమే ఇబ్బందిగా మారింది. ప్రస్తుత కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో తప్పుకోవడం 17వ సీజన్ లో శామ్ కరన్ జట్టును లీడ్ చేశాడు. వీరిద్దరూ కూడా ఫ్రాంచైజీ ఓనర్ల అంచనాలను అందుకోలేకపోయారు. ఈ సీజన్ లో పంజాబ్ ఏడు విజయాలతో ఆరోస్థానానికే పరిమితమైంది. వేలానికి ముందే ధావన్ ను రిలీజ్ చేయనున్న పంజాబ్ రోహిత్ శర్మను సారథిగా ప్రయత్నించే అవకాశముంది.

కాగా కెరీర్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్ శర్మ 2011లో ముంబైకి మారాడు. ఆ తర్వాత 2013లో ముంబై జట్టు పగ్గాలు అందుకున్న హిట్ మ్యాన్ ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు. ఆటగాడిగానూ ఐపీఎల్ లో రోహిత్ కు తిరుగులేని రికార్డుంది. రోహిత్ 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ ను చూస్తే 257 మ్యాచ్ లలో 6628 పరుగులు చేసాడు. దీనిలో 2 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సారి మెగా వేలంలో రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశముంది.

Also Read: Revanth On Budget: సబ్ కా సాత్ పెద్ద బోగస్, బడ్జెట్‌పై సీఎం ఫైర్

Follow us