Most Wickets Across Formats: ఈరోజు 2024వ సంవత్సరానికి చివరి రోజు. చాలా మంది క్రికెటర్లకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అదే సమయంలో ఈ సంవత్సరం టీమ్ ఇండియా ఆటగాడు బుమ్రా తన బౌలింగ్‌లో అద్బుతంగా రాణించాడు. ఈ ఆటగాడు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియా ప్రతిష్ట నిలబెట్టాడు. ఈ రోజు మనం 2024 సంవత్సరంలో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు (Most Wickets Across Formats) తీసిన ముగ్గురు బౌలర్ల గురించి తెలుసుకుందాం. ఇందులో భారత్‌కు చెందిన ఒక బౌలర్, శ్రీలంక నుండి ఒకరు, వెస్టిండీస్ నుండి ఒకరు ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా (టీమిండియా)
జస్ప్రీత్ బుమ్రాకు 2024 గొప్ప సంవత్సరం. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది అతను మొత్తం 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో బుమ్రా 86 వికెట్లు తీశాడు. ఇందులో బుమ్రా టెస్టుల్లో అత్యధికంగా 71 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ పర్యటనలో ఉన్నారు. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉంది. ఈ సిరీస్‌లో చివరి, ఐదో టెస్టు మ్యాచ్ జనవరి 3వ తేదీన మొదులు కానుంది.
Also Read: Solar Car : ఇది భారతదేశపు మొట్టమొదటి సోలార్ కారు.. 50 పైసలకు 1 కి.మీ నడుస్తుంది..!
వనిందు హసరంగా (శ్రీలంక)
2024లో శ్రీలంక స్పిన్ బౌలర్ వనిందు హసరంగా సంచలనం సృష్టించాడు. హసరంగ 2024లో 30 మ్యాచ్‌లు ఆడాడు. బౌలింగ్‌లో 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హసరంగ టీ20లో 38 వికెట్లు, వన్డేల్లో 26 వికెట్లు తీశాడు.
అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్)
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో బౌలింగ్ చేస్తూ 63 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అల్జారీ 35 మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌కు మూడు ఫార్మాట్లలో అల్జారీ అద్భుత ప్రదర్శన చేశాడు.