Site icon HashtagU Telugu

Big Players: ఐపీఎల్ మెగా వేలం.. ఈ స్టార్ ఆట‌గాళ్లు అమ్ముడుపోక‌పోవ‌చ్చు!

IPL 2025 Refund

IPL 2025 Refund

Big Players: ఐపీఎల్ 2025 మెగా వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆటగాళ్ల వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. ఈసారి మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. దీంతో వేలంలో పాల్గొనే ఆటగాళ్లందరి బేస్ ధర కూడా వెల్లడైంది. ఇప్పుడు ముగ్గురు పెద్ద ఆటగాళ్ల బేస్ ధర వారు వేలంలో అమ్ముడుపోకుండా ఉండటానికి కారణం కావచ్చని ఓ నివేదిక చెబుతోంది. ఈ ఆటగాళ్ల బేస్ ధర ఎక్కువగా ఉంది. అలాగే వారి ఫామ్ కూడా ఆందోళ‌కరంగానే ఉంది. దీని కారణంగా దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఈ ఆటగాళ్లను విస్మరించవచ్చు. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉమేష్ యాదవ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లో ఉమేష్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడాడు. అత‌ని ఫామ్ కూడా ఆందోళ‌న‌క‌రంగానే ఉంది. ఉమేష్ యాదవ్‌ను ఈసారి గుజరాత్ టైటాన్స్ విడుదల చేసింది. ఈ ఆటగాడు ఇప్పుడు మెగా వేలంలో భాగం కాబోతున్నాడు. మెగా వేలంలో ఉమేష్ బేస్ ధర రూ.2 కోట్లు. అయితే ఇప్పుడు తలెత్తుతున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే.. రూ.2 కోట్ల బేస్ ధరతో ఉమేష్‌ను ఏ ఫ్రాంచైజీ అయినా కొనుగోలు చేస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Sanjay Bangar Daughter: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కుమారుడు!

స్టీవ్ స్మిత్

ఈసారి మెగా వేలంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కూడా భాగం కాబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి విడుదలైన తర్వాత స్టీవ్ స్మిత్ బేస్ ధర రూ.2 కోట్లు. అయితే ఇటువంటి అధిక బేస్ ప్రెస్ కారణంగా ఈ శక్తివంతమైన ప్లేయర్ మెగా వేలంలో అమ్ముడుపోకుండా ఉండవచ్చు. ఇది కాకుండా స్మిత్ ప్రస్తుత ఫామ్ కూడా ఆందోళ‌క‌రంగానే ఉంది.

భువనేశ్వర్ కుమార్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. ఆ తర్వాత ఈ బౌలర్ మెగా వేలంలో భాగం కాబోతున్నాడు. ఈ ప్లేయర్ బేస్ ధర రూ. 2 కోట్లు. కానీ అధిక బేస్ ధర కారణంగా భువనేశ్వర్ కూడా అమ్ముడుపోకుండా ఉండొచ్చు. దేశీయ క్రికెట్‌లో కూడా భువీ రాణించ‌లేక‌పోయాడు.