Site icon HashtagU Telugu

World Cup 2023: ప్రపంచ కప్ విజేత ప్రైజ్‌మనీ ఎంత?

ODI World Cup 2027

World Cup 2023

World Cup 2023: పుష్కరకాలం తరువాత సొంత గడ్డపై ప్రపంచ కప్ జరగనుంది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ లో టీమిండియా టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగుతుంది. రోహిత్ సేన సారధ్యంలో ఈ సారి ప్రపంచ కప్ ఆడనుంది. ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియా మూడు వన్డేల సన్నాహక సిరీస్ ఆడుతుంది. మొదటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సారధ్యంలో బరిలోకి దిగింది. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా అక్టోబరు 5న వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు పార్టిసిపేట్ చేస్తుండగా ఇప్పటికే అన్ని జట్లు తమ స్క్వాడ్స్ ను ప్ర‌క‌టించాయి.

ఐసీసీ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మ‌నీని కూడా ప్ర‌క‌టించింది. ప్రపంచ కప్ కోసం కోటి డాల‌ర్ల‌ను కేటాయించిన‌ట్టు ICC చెప్పింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 82 కోట్లు. విజేత‌కు 40 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 20 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే16.5 కోట్లు ఫిక్స్ చేశారు. ఇక నాకౌట్‌ చేరకుండా వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 82 లక్షలు ఇవ్వనున్నట్టు ఐసీసీ తెలిపింది. అయితే 2019లో జరిగిన ప్రపంచ కప్ లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు 27 కోట్లు బహుమతిగా అందించారు. ఫైనల్లో ఓటమితో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 14 కోట్లు దక్కాయి. ఇక సెమీస్ లో ఓడిన భారత్, ఆసీస్ లకు చెరో 5.6 కోట్లు ముట్టజెప్పారు.

Also Read: Tamilanadu: శరీర అవయవ దానం..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

Exit mobile version