Site icon HashtagU Telugu

2007 T20 WC: 2007 ప్రపంచకప్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు

Jogindra Sharma

Jogindra Sharma

2007 T20 WC: మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో 2027లో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన మాహీ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు. టోర్నీలో టీమిండియాను ఫైనల్ కు చేర్చి, ఫైనల్ లో తన మార్క్ చూపించాడు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ తో హోరాహోరిగా పోరాడుతుంది. అప్పటికే మ్యాచ్ పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. చివరి ఓవర్ ని ధోనీ జోగిందర్ శర్మతో వేయించాడు. నాలుగు బంతుల్లో పాక్ సిక్స్ రన్స్ రాబట్టాలి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోనీ ఇన్ పుట్స్ తీసుకుని అద్భుతంగ బౌలింగ్ చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

జోగింద‌ర్ శ‌ర్మ వేసిన మూడో బంతికే ప్ర‌మాద‌క‌ర‌మైన మిస్బావుల్ హ‌క్‌ ను ఔట్ చేశాడు. దాంతో జోగేందర్ శర్మ పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత జోగేందర్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్ లో రాణించాడు. 2010, 11 సీజన్లలో శర్మ చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా క్రికెట్ కు అందించిన సేవలకు గాను జోగిందర్ శర్మ కు 2011లో హరియాణా ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం ఇచ్చింది.

హరియాణా పోలీస్ డిపార్ట్ మెంట్ లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జోగేందర్ శర్మ ఓ హత్య కేసులో ఇన్ వోల్వ్ అవ్వడంతో ఈ మాజీ క్రికెట‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. జనవరి 1న హిసార్‌లోని ద‌ళిత కుటుంబానికి చెందిన‌ ప‌వ‌న్ అనే వ్య‌క్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి వివాదాల కార‌ణంగానే అత‌డు బ‌ల‌వ‌ర్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డానే వార్త‌లు వినిపించాయి. అయితే పవన్ కుటుంబం మాత్రం ఆత్మ‌హ‌త్య వెనుక పోలీసుల హ‌స్తం ఉంద‌ని ఆరోపించింది. పైగా ఆస్తి వివాదంపై మూడేళ్ల క్రితం జోగేందర్ శర్మకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.ప్రస్తుతమ్ ఈ కేసు విచారణలో ఉంది.

Also Read: Praja Palana : ముగిసిన ప్రజా పాలన..మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా..?

Exit mobile version