Umran Malik@154km: ఈ వేగానికి అడ్డేది…

ఐపీఎల్ 2022 సీజన్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ ప్రత్యేకించి పేస్ బౌలర్ల వేగానికి సంబంధించి రికార్డుల పరంపర కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 01:19 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ ప్రత్యేకించి పేస్ బౌలర్ల వేగానికి సంబంధించి రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన ఉమ్రాన్ మాలిక్ మరోసారి రికార్డు సృష్టించాడు. సీజన్ ఆరంభం నుంచీ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో

సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి సీజన్‌లోనే అత్యుత్తమ స్పీడ్‌ బాల్‌ రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ బాల్.

గుజరాత్ టైటాన్స్ పేసర్ ఫెర్గ్యుసన్ పేరిట ఉన్న రికార్డును మాలిక్ బద్దలు కొట్టాడు. ఫెర్గ్యుసన్ 153 కిలోమీటర్ల వేగంతో రికార్డు నెలకొల్పితే.. దీని కంటే మరో కిలోమీటర్ వేగంతో బాల్ వేసి రికార్డ్ సృష్టించాడు. ఈ సీజన్‌లో నమోదైన టాప్ 5 ఫాస్టెస్ట్ బాల్స్ జాబితాలో నాలుగు ఉమ్రాన్ పేరిటే ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌లలో ఏడు సార్లు ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులు సొంతం చేసుకున్నాడు. కాగా ఈ

సీజన్‌లో 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉమ్రాన్ మాలిక్ చెప్పాడు. వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయడంతోనే ఈ వేగాన్ని నిలకడగా అందుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత సీజన్‌లో నెట్ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్ ఇప్పుడు కీలక పేసర్‌గా మారిపోయాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

ఈ యువ పేసర్ బౌలింగ్‌కు మాజీ క్రికెటర్లే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉమ్రాన్ బౌలింగ్‌ను ప్రశంసిస్తున్నారు. బీసీసీఐ అతనికి ప్రత్యేక కోచ్‌ ద్వారా ట్రైనింగ్ ఇప్పించాలని కూడా సూచించారు. ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై ఐదు వికెట్లతో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. అలాగే పంజాబ్‌పై 4 వికెట్లతో ఆకట్టుకున్న ఉమ్రాన్

మాలిక్ 9 మ్యాచ్‌లలో 19.13 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌కు సంబంధించి అత్యధిక వికెట్ల జాబితాలో ఉమ్రాన్ మాలిక్ టాప్ ఫైవ్‌లో కొనసాగుతున్నాడు.