Site icon HashtagU Telugu

11 Cricketers Born : ఒకే రోజు పుట్టిన 11 మంది క్రికెటర్లు

11 cricketers born on october 14

11 cricketers born on october 14

11 cricketers born on October 14 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఒకేరోజున పుట్టినరోజు జరుపుకున్నారు. వీళ్ళలో టీమిండియా తరుపున ఒకే ఒక్క ఆటగాడు ఉన్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ అక్టోబర్ 14, 1976లో జన్మించాడు. 1999లో తిలకరత్న శ్రీలంక జట్టుకు అరంగేట్రం చేశాడు. 16 సంవత్సరాలపాటు జట్టుకు ఆడాడు. శ్రీలంక తరపున 87 టెస్ట్ మ్యాచ్‌లలో 16 సెంచరీల సహాయంతో 5492 పరుగులు చేశాడు. వన్డేల్లో 10290 పరుగులు చేశాడు. కాగా టీ20లో 1 సెంచరీ, 13 హాఫ్ సెంచరీల సాయంతో 1889 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ అక్టోబర్14, 1981న ఢిల్లీలో జన్మించాడు. 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మరియు 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఇండియాను రెండు సార్లు ఛాంపియన్‌గా నిలపడంతో గణనీయమైన కృషి చేశాడు. గౌతమ్ గంభీర్ టెస్టుల్లో మొత్తం 4154 పరుగులు చేయగా, వన్డేల్లో 147 మ్యాచ్‌లు ఆడి 5238 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20లో 932 పరుగులు చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15153 పరుగులు మరియు లిస్ట్ ఎలో 10077 పరుగులు చేశాడు.

పాకిస్థాన్ ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ షాన్ మసూద్ 1989 అక్టోబర్ 14న కువైట్‌లో జన్మించాడు. 13 సంవత్సరాల వయస్సులో అతను పాకిస్తాన్ అండర్-15 జట్టుకు ఎంపికయ్యాడు మరియు 27 సంవత్సరాల వయస్సులో 2013లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు షాన్ 36 టెస్టుల్లో 2045 పరుగులు చేయగా, 9 వన్డేల్లో 163 ​​పరుగులు, 19 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 395 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అక్టోబర్14, 1988న జన్మించాడు. మ్యాక్స్ వెల్ ఆస్ట్రేలియా తరఫున 113 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 2600 పరుగులు చేయగా, 7 టెస్టు మ్యాచ్‌ల్లో 339 పరుగులు, 142 వన్డేల్లో 3934 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 7 టెస్టు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు, 142 వన్డేల్లో 75 వికెట్లు, 113 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు.

పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్,మరియు బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ 1968 అక్టోబర్ 14న కరాచీలో జన్మించాడు. అతను 11 సంవత్సరాల కాలంలో మొత్తం 37 టెస్టులు మరియు 166 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 37 టెస్టు ల్లో 1381 పరుగులు, 166 వన్డేల్లో 1709 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో 156 మ్యాచ్‌ల్లో 5094 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ అష్టన్ అగర్ 14 అక్టోబర్ 1993న జన్మించాడు. అష్టన్ ఇప్పటివరకు మొత్తం 37 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 1381 పరుగులు చేశాడు. 166 వన్డే మ్యాచ్‌లు ఆడుతూ 1709 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో 156 మ్యాచ్‌లు ఆడుతూ 5094 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డగ్ రింగ్ 14 అక్టోబర్ 1918న జన్మించాడు. ఆయన మన మధ్య లేకపోయినా తన అద్భుత ప్రదర్శన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. టెస్టులో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్‌లో 129 మ్యాచ్‌లు ఆడి 451 వికెట్లు తీశాడు. ఇక పాకిస్థాన్ అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో సయీద్ అజ్మల్ ఒకడు. అతను 1977 అక్టోబర్ 14న పంజాబ్‌లో జన్మించాడు. ఇప్పటివరకు సయీద్ 35 టెస్టుల్లో 178 వికెట్లు తీయగా, 113 వన్డేల్లో 184 వికెట్లు తీశాడు. 64 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాక్ యంగ్ 1912 అక్టోబర్ 14న జన్మించాడు. 80 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. కానీ నేటికీ క్రికెట్ ప్రపంచంలో ఆయన పేరు వినిపిస్తుంది. టెస్టులో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టగా, ఫస్ట్ క్లాస్‌లో 341 మ్యాచ్‌ల్లో 1361 వికెట్లు తీశాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ హసంత ఫెర్నాండో 14 అక్టోబర్ 1979న జన్మించాడు. హసంత టెస్టులో 2 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 4 వికెట్లు, వన్డేలో 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. హసంత 2 టెస్టుల్లో 38 పరుగులు, 7 వన్డేల్లో 43 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో 8673 పరుగులు మరియు లిస్ట్-ఎ క్రికెట్‌లో 2969 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ మాజీ టెస్టు క్రికెటర్ జాక్ క్రాప్ 1912 అక్టోబర్ 14న జన్మించాడు. క్రాప్ 7 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, అందులో అతను 319 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని పేరిట 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Read Also : Rape : హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం