Site icon HashtagU Telugu

Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

Dismissed On 99

Dismissed On 99

Dismissed On 99: భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు తమదైన ముద్ర వేశారు. కొందరు బ్యాట్స్‌మెన్ శతకాల మీద శతకాలు సాధించారు. అయితే సెంచరీకి కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో.. అంటే 99 పరుగుల (Dismissed On 99) వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుటై నిరాశగా పెవిలియన్ చేరిన భారత దిగ్గజాల జాబితా ఇది. 99 పరుగుల వద్దే కాకుండా డబుల్ సెంచరీ (199), ట్రిపుల్ సెంచరీకి (299) ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన ఆటగాళ్లను కూడా ఈ జాబితాలో చేర్చడం జరిగింది. టెస్టుల్లో అత్యధిక సార్లు (రెండు సార్లు) 99 లేదా 199 పరుగుల వద్ద అవుటైన భారత బ్యాట్స్‌మెన్‌లు ఎవ‌రో ఇప్పుడు ఆర్టిక‌ల్‌లో చూద్దాం.

సౌరవ్ గంగూలీ

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో రెండు సార్లు 99 పరుగుల వద్ద అవుటయ్యాడు. 1997లో శ్రీలంకపై, 2002లో ఇంగ్లాండ్‌పై ఈ రెండు సందర్భాల్లోనూ ‘దాదా’ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది.

మహేంద్ర సింగ్ ధోని

భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని పేరు కూడా ఈ జాబితాలో ఉంది. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 99 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుటయ్యాడు.

వీరేంద్ర సెహ్వాగ్

విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో ఒకసారి సెంచరీకి ఒక పరుగు దూరంలో అవుటయ్యాడు. 2010లో శ్రీలంకపై 99 పరుగుల వద్ద సెహ్వాగ్ పెవిలియన్ చేరాడు. అయితే సెహ్వాగ్ 293 (ట్రిపుల్ సెంచరీకి దగ్గరగా), 309 (ట్రిపుల్ సెంచరీ) వంటి మైలురాళ్లను కూడా అందుకున్నాడు.

Also Read: Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

కేఎల్ రాహుల్

ప్రస్తుత జట్టులోని ఆటగాడైన కేఎల్ రాహుల్ 199 పరుగుల వద్ద అవుటై డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రాహుల్ అద్భుతంగా ఆడి 199 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన క్రికెటర్‌గా నిలిచాడు.

మహ్మద్ అజారుద్దీన్

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా 199 పరుగుల వద్ద డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 1986లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో అజారుద్దీన్ 199 పరుగుల వద్ద అవుటయ్యాడు.

మురళీ విజయ్

ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అవుటయ్యాడు. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయ్ 99 పరుగుల వద్ద ఔటయ్యి, శతకాన్ని పూర్తి చేయలేకపోయాడు.

నవజోత్ సింగ్ సిద్ధూ

సిద్ధూ కూడా 99 పరుగుల ఫ్రస్ట్రేషన్‌ను అనుభవించాడు. 1994లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిద్ధూ 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

అజిత్ వాడేకర్

భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. 1967లో ఆస్ట్రేలియాపై వాడేకర్ 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

ముంగన్హళ్లి జైసింహా

ముంగన్హళ్లి జైసింహా కూడా 99 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద తన వికెట్‌ను కోల్పోయాడు. 1960లో పాకిస్తాన్‌పై 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.

పంకజ్ రాయ్

పంకజ్ రాయ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. 1959లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ఆయన 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

Exit mobile version