Site icon HashtagU Telugu

GST Notices: స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై రూ.500 కోట్ల జిఎస్‌టి

GST notices

GST notices

GST Notices: స్విగ్గీ, జొమాటో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో మరియు స్విగ్గీ డెలివరీ ఛార్జీలపై రూ. 500 కోట్ల జిఎస్‌టి నోటీసులను అందుకున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుండి కొంత డబ్బు వసూలు చేస్తాయి. అయితే డెలివరీ ఫీజుకు సంబంధించి పన్ను అధికారులు మరియు ఫుడ్ డెలివరీ యాప్‌ల మధ్య తరచుగా వివాదం జరుగుతుంది. డెలివరీ ఛార్జీ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదని డెలివరీ యాప్‌ వాళ్ళు చెప్తున్నారు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుండి సేకరించి, డెలివరీ భాగస్వాములకు అందజేస్తాయి. కానీ పన్ను శాఖ అధికారులు దీనికి అంగీకరించడం లేదని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: Barrelakka Manifesto : బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు దీటుగా బర్రెలక్క మేనిఫెస్టో