Zomato: హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. సాలన్ మాత్రమే వచ్చింది.. జొమాటో యూజర్ కు షాక్!!

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక్కోసారి గందరగోళం జరుగుతుంటుంది. ఒక పార్శిల్ బదులు మరొకటి వస్తుంటుంది.

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 11:27 PM IST

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక్కోసారి గందరగోళం జరుగుతుంటుంది. ఒక పార్శిల్ బదులు మరొకటి వస్తుంటుంది. చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిన సందర్భాల్లో.. ఏదో ఒక ఫుడ్ ఐటమ్ మిస్ కావడం కూడా జరుగుతుంటుంది. ఇటీవల గురుగ్రామ్ కు చెందిన ప్రతీక్ కన్వాల్ అనే వ్యక్తి జొమాటోలో
హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేయగా .. బిర్యానీ పార్శిల్‌లో బిర్యానీ మిస్ అయింది. ప్రతీక్ కన్వాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెబుతూ.. “నేను జొమాటో కస్టమర్ ను మాత్రమే కాదు.. దానిలో ఒక షేర్ హోల్డర్ ను కూడా. కస్టమర్ గా, షేర్ హోల్డర్ గా నాకు డబుల్ లాస్ అయింది. ఇలాంటి సమస్య మరెవరికి ఎదురుకాకుండా చూడాలని కంపెనీ సీఈవోను కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు.

“హైదరాబాద్ లోని హోటల్ షాదాబ్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇందుకోసం జొమాటో ఇంటర్ స్టేట్ లెజెండ్” సర్వీస్ ను వాదుకున్నాను. నాకు డెలివరీలో ఒక చిన్న సాలన్ బాక్స్ మాత్రమే వచ్చింది. బిర్యానీ రాలేదు” అని తన గోడును ప్రతీక్ కన్వాల్ వెళ్లబోసుకున్నాడు. జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ట్రాక్ చేసిన జొమాటో..

తన డిన్నర్ ప్లాన్స్ గాల్లో కలిసిపోయాయని, ఇప్పుడు తనకు గుర్గావ్‌లో బిర్యానీ కావాలని ట్వీట్ చేశాడు. ఫోటోలు కూడా షేర్ చేశాడు.వెంటనే జొమాటో సిబ్బంది రంగంలోకి దిగి సదరు కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ పార్శిల్ ఎక్కడ మిస్ అయిందో ట్రాక్ చేశారు. ఆ బిర్యానీతో పాటు, బిర్యానీ బై కిలో నుంచి మరో పార్శిల్ కూడా పంపించారు. దీంతో ప్రతీక్ కన్వాల్ మళ్లీ ఓ ట్వీట్ చేశారు. జొమాటో టీమ్ తన పార్శిల్‌ను ట్రాక్ చేయడంతో పాటు, అదనంగా బిర్యానీ పంపించారని ఫోటోలు పోస్ట్ చేశారు.

‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ అంటే?

జొమాటో ఇటీవల ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’  పేరుతో కొత్త సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోని ఏ ప్రాంతంలోని ప్రముఖ ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికి ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్ బిర్యానీ , కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్స్, బెంగళూరు మైసూర్ పాక్… ఇలా ఒక ప్రాంతంలో ఫేమస్ అయిన ఫుడ్‌ని మరో నగరంలో ఉన్నవారు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. వారం క్రితం ప్రారంభమైన ఈ సర్వీస్‌ను జొమాటో కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ సర్వీస్ ద్వారానే ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చెందిన
ప్రతీక్ కన్వాల్ హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే పార్శిల్ వచ్చింది. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్ అయ్యాడు.