Zomato Co-Founder: జొమాటో కో-ఫౌండర్ మోహిత్‌గుప్తా రాజీనామా..!

జొమాటో సంస్థ కో ఫౌండర్ మోహిత్ గుప్తా రాజీనామా చేశారు.

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 09:45 PM IST

జొమాటో సంస్థ కో ఫౌండర్ మోహిత్ గుప్తా రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్ల పాటు సంస్థకు సేవలు అందించిన ఆయన శుక్రవారం సంస్థ నుంచి వైదొలిగారు. ఆయనతో కలిసి ఇటీవల కాలంలో సంస్థకు ముగ్గురు ప్రముఖులు రాజీనామా చేశారు. ఫుడ్ డెలివరీ విభాగ మాజీ చీఫ్ రాహుల్ గంజూ, ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ ఝువార్ కూడా రాజీనామా చేశారు.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కంపెనీ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. మోహిత్ గుప్తా నాలుగున్నర సంవత్సరాల క్రితం Zomatoలో చేరారు. అయితే తన వీడ్కోలు సందేశంలో అతను చాలా కాలం పాటు Zomatoలో దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. సంవత్సరాలుగా నిర్మించిన ప్రతిదీ ముందుకు సాగేలా చూడాలనుకుంటున్నాను. పట్టుదలగా ఉండండి.. నేర్చుకుంటూ ఉండండి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు రోల్ మోడల్‌గా ఉండాలనుకునే కంపెనీని నిర్మించండి అంటూ ఆయన పేర్కొన్నారు.

గుప్తా 2020లో CEO స్థానం నుండి సహ వ్యవస్థాపకుడిగా పదోన్నతి పొందారు. మోహిత్ గుప్తా రాజీనామా ఇటీవల వారాల్లో జొమాటో ఫుడ్ డెలివరీ కంపెనీ నుండి మూడవ హై ప్రొఫైల్ రాజీనామా. జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా నాలుగున్నరేళ్ల తర్వాత కంపెనీని విడిచిపెట్టారు. జొమాటో కంపెనీ దేశవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ నగరాల్లో ఆహార పంపిణీ సేవలను అందిస్తుంది.