Zepto : “10 నిమిషాల్లో డెలివరీ” అని గొప్పగా చెప్పుకునే జెప్టో ఇప్పుడు తీవ్ర విమర్శల మునిగింది. మహారాష్ట్రలోని ధారావిలో ఉన్న జెప్టో వేర్‌హౌస్‌లో బూజు పట్టిన, గడువు తీరిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉన్న ఉత్పత్తులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ ఘటన వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తూ, జెప్టో నాణ్యతా ప్రమాణాలపై సీరియస్ ప్రశ్నలను లేవనెత్తింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో ఈ దారుణమైన విషయాలు బయటపడ్డాయి. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలడంతో, ధారావిలోని జెప్టో వేర్‌హౌస్ లైసెన్స్‌ను అధికారులు వెంటనే రద్దు చేశారు.
Opal Suchata Chuangsri : ప్రభాస్ మూవీ చూస్తా..రివ్యూ ఇస్తా అంటున్న మిస్ వరల్డ్ విన్నర్
బూజు పట్టిన ఆహారం, గడువు ముగిసిన ఉత్పత్తులు వినియోగదారులకు సరఫరా కావడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. “10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని చెప్పి, ఇలాంటి నాసిరకం ఉత్పత్తులు పంపడం ఏమిటి?” అని ఓ కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జెప్టోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, వినియోగదారులు తమ నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఈ ఘటన జెప్టో వేర్‌హౌస్‌లలో నాణ్యత నియంత్రణ, శుభ్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. జెప్టో ఈ సమస్యను ఎలా సరిదిద్దుకుంటుందనేది చూడాల్సి ఉంది. అప్పటివరకూ, వినియోగదారులు జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం.
Raja Saab Leak : ‘రాజా సాబ్’ ప్రభాస్ లుక్ లీక్..ట్రెండ్ సెట్ చేస్తున్న ఫ్యాన్స్