Site icon HashtagU Telugu

RR Nails KKR: బట్లర్ శతకం…చాహాల్ హ్యాట్రిక్ రాజస్థాన్ కు మరో విజయం

Rcb

Rcb

ఐపీఎల్ 15వ సీజన్ లో మరో మ్యాచ్ అభిమానులను ఉర్రూతూగించింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ లో రాజస్తాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో కోల్ కత్తా పై విజయం సాధించింది. బట్లర్ మరోసారి సెంచరీ తో రెచ్చిపోతే బౌలింగ్ చహల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు.మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసింది. జాస్‌ బట్లర్‌ 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్ రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్‌ 38 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెట్‌మైర్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో మెరిశాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌, రసెల్‌ తలా ఒక​ వికెట్‌ తీశారు.

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ కూడా దూకుడుగా ఆడింది. పవర్ ప్ల లో బౌండరీ వర్షం కురిపించారు. అంతకముందు సునీల్‌ నరైన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే నరైన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఫించ్ , శ్రేయాస్ అయ్యర్ రెచ్చిపోవడంతో కోల్ కత్తా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఫించ్ ఔట్ అయిన అయ్యర్ దూకుడు గా అడదంతో కోల్ కత్తా గెలిచేలా కనిపించింది.
లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్‌కు చహల్‌ గట్టిషాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో చహల్‌ హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు తీశాడు. ముందుగా వెంకటేశ్‌ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్‌ అయ్యర్‌, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ చరిత్ర సృష్టించాడు. చివర్లో ఉమేష్ యాదవ్ కాస్త భయపెట్టిన రాజస్తాన్ రాయల్స్ దే పై చేయిగా నిలిచింది.

Pic Courtesy- Twitter