IPL-2022సీజన్ పాయింట్స్ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మరోసారి టేబుల్ టాప్ పొజిషన్ కి దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో కొన్ని పరుగుల తేడాతోనే విజయాన్ని అందుకున్న రాయల్స్…గత మ్యాచ్ పరాజయం తర్వాత అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. 166 పరుగుల లక్ష్యంతో లాస్ట్ ఓవర్…లాస్ట్ బాల్ వరకు పోరాడిన లక్నో 162 పరుగులకు పరిమితమై 3 పరుగుల తేడాతో ఓడింది. ఓ దశలో కష్టాల్లో ఉన్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చివర్లో మంచి మైలేజ్ ఇచ్చాడు హెట్ మేయర్. దీంతో నిర్ణీత 20ఓవర్లలో 6 వికేట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్ . హెట్ మేయర్ 36 బంతుల్లో 59 పరుగులు నాటౌట్ గా నిలిచారు. సూపర్ ఇన్నింగ్ ఆడాడు. రవి చంద్రన్ అశ్విన్ 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఇక క్రిష్ణప్ప గౌతమ్, హోల్డర్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కు వీరిద్దరూ కూడా మంచి ఆరంభం అందించారు. ఓపెన్లరు బట్లర్ పడిక్కల్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేశారు. అయితే సూపర్ ఫాంలో ఉన్న జాస్ బట్లర్ ను బోల్తా ఆవేశ్ ఖాన్ బోల్తా కొట్టించాడు. 13 పరుగులు చేసిన బట్లర్ ఓ సూపర్ బంతికి ఆవేక్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 42 పరుగులకు రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రాజస్థాన్ స్కోరు వేగానికి బ్రేకులు పడినట్లయ్యింది.
తర్వాత రాజస్థాన్ బ్యాట్స్ మెన్ నిదానంగా ఆడారు. ఒక్కసారికి ఒత్తిడికి లోనయ్యారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. కె గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ మొదటి బంతికి పడిక్కల్(29)ఔట్ అయ్యాడు. వాండర్ డుసెన్ ఐదో బంతికి (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో.. 64 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది. ఆ కాసేపటికే రాజస్థాన్ కెప్టెన్ సంజూ శామ్సన్ (13) కూడా ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ కష్టాలు మరింత పెరిగాయి. సంజూ శామ్సన్ హోల్డర్ బౌలింగ్ లో LBWగా వెనుదిరిగాడు.
హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను సరిదిద్దే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. వారిద్దరూ కూడా ఆచితూచి ఆడుతూ…వీలు చిక్కినప్పుడల్లా బాల్ ను బౌండరీలు దాటించారు. 50 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. 17వ ఓవర్ లో హెట్ మేయర్ విశ్వరూపం చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ కు మంచి స్కోరు అందించాడు.
Photo Courtesy- Rajasthan Royals/Twitter
WHAT. A. GAME! 👌 👌@rajasthanroyals return to winning ways after edging out #LSG by 3 runs in a last-over finish. 👏 👏
Scorecard 👉 https://t.co/8itDSZ2mu7#TATAIPL | #RRvLSG pic.twitter.com/HzfwnDevS9
— IndianPremierLeague (@IPL) April 10, 2022