Site icon HashtagU Telugu

Yuvagalam : నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కార‌ణం ఇదే..?

Yuvagalam

Yuvagalam

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. తుపాను కార‌ణంగా యువ‌గళం పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మూడు రోజుల పాటు యువ‌గ‌ళం పాద‌యాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర కొన‌సాగుతుంది. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులు వీస్తున్న నేప‌థ్యంలో పాద‌యాత్ర‌కు ఇబ్బందిక‌రంగా మారింది. తుపాను ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారి పాకల నుంచి యువగళం ప్రారంభించాలని లోకేష్ నిర్ణ‌యించారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌కు దాదాపు రెండు నెల‌ల పాటు బ్రేక్ ప‌డింది. చంద్ర‌బాబు రిలీజ్ అయ్యాక మ‌ళ్లీ పాద‌యాత్ర‌ను నారా లోకేష్ ప్రారంభించారు. యువ‌గ‌ళం 2.0కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. లోకేష్ కి అడుగ‌డుగునా ప్ర‌జ‌లు ఆపూర్వ‌స్వాగ‌తం ప‌లుకుతున్నారు.

Also Read:  Congress : భీమవరంలో రేవంత్ కూతురు నిమిషా రెడ్డి సంబ‌రాలు

Exit mobile version