Rushikonda : రుషికొండపై రాష్ట్ర సచివాలయ నిర్మాణం – వైసీపీ ప్రకటన

రుషికొండ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అక్కడ టూరిస్ట్ ప్రాజెక్టులు కడుతున్నామని , ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు కట్టడం లేదని

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 07:56 AM IST

వైస్సార్సీపీ సంచలన ప్రకటన చేసింది. రుషికొండ (Rushikonda)పై రాష్ట్ర సచివాలయ నిర్మాణం (New Secretariat Building) చేపడుతున్నట్లుగా శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. మొన్నటి వరకు రుషికొండ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అక్కడ టూరిస్ట్ ప్రాజెక్టులు కడుతున్నామని , ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు కట్టడం లేదని గతంలో వైసీపీ ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడేమో లేదు లేదు..అక్కడ రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపడుతున్నాం..రుషికొండ ను కొంతమేర తీసేసి, అక్కడ నిర్మాణం చేపడుతున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ ప్రకటన తో అంత షాక్ లో పడ్డారు.

వైసీపీ చేసిన ట్వీట్ ఇలా ఉంది. ‘‘విశాఖను దోచుకుంది టీడీపీ నాయకులేనని సాక్షాత్తూ గత మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనలేదా? టీడీపీ నాయకులు దోచుకున్న 450 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు వైయస్ జగన్ గారు. దాని మీద మీ పార్టీ దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

రుషికొండ ఫై గత కొద్దీ నెలలుగా రాజకీయంగా పెద్ద రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఏ కొండలు ,గుట్టలు వదిలిపెట్టడం లేదు. గుట్టలను తవ్వించి రియల్ ఎస్టేట్ భూముల్లాగా అమ్మేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రుషికొండ ను సైతం ఇలాగే తవ్వుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రుషికొండ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని , రుషికొండపై పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. వరదలు, తుఫానులు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉండేందుకే రుషికొండ ఉందన్నారు. రుషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు.. అందుకే తెలంగాణలో తన్ని తరిమేశారన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మరి ఇప్పుడు రుషికొండ లో రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లుగా వైసీపీ ప్రకటన చేయడం ఫై ప్రతిపక్ష పార్టీలు ఏమంటాయో చూడాలి.