Site icon HashtagU Telugu

Driver Murder Case: అనంత బాబు అరెస్ట్ కు రంగం సిద్ధం

ananta YSRCP

ananta YSRCP

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంల సుబ్రమణ్యం భార్య అంగీకారంతో మృతదేహానికి పోస్టుమార్టంకు తరలించారు. దీంతో సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఎస్పీ, కలెక్టర్‌ హామీతో సుబ్రమణ్యం భార్య, కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో అర్థరాత్రి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్యకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం సొంతూరులో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కోసం.. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ, ఎల్లవరం, రాజానగరంలలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు అనంతబాబును అరెస్టు చూపించే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version