Devineni vs Vasantha : మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత ఘాటు వ్యాఖ్య‌లు..!

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వ‌ర‌రావుపై వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. ఏ పనీపాట లేక,..

Published By: HashtagU Telugu Desk
Devineni Uma Imresizer

Devineni Uma Imresizer

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వ‌ర‌రావుపై వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. ఏ పనీపాట లేక, తిన్నది అరగక.. జీవితంలో నిరర్ధకమైన జీవితాలు కొన్ని ఉంటాయని… అలాంటి కోవకే చెందిన నిరర్ధకమైన జీవి దేవినేని ఉమామహేశ్వరరావు అంటే వ్యాఖ్య‌లు చేశారు. దేవినేని ఉమా కల్లబొల్లి మాటలు చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకునే వ్యక్తి అని.. ఆయ‌న‌ మంత్రిగా వెలగబెట్టినప్పుడు జక్కంపూడిలో ఎప్పటినుంచో పంటలు సాగు చేస్తున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకున్నార‌ని ఎమ్మెల్యే వ‌సంత ఆరోపించారు. దేవినేని ఉమా వల్ల కనీసం జక్కంపూడిలో ఎవ్వరికీ ఉపయోగం లేదన్నారు. విజయవాడ రూరల్ మండలంలో వైఎస్సార్ కాలనీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి క‌ట్టార‌ని..పదేళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్సార్ కాలనీలో ఏనాడూ ప‌ట్టించుకోలేద‌న్నారు. రోజూ తిన్నది అరగక దేవినేని ఉమా తిరుగుతున్నార‌ని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఎద్దేవా చేశారు.

  Last Updated: 28 Oct 2022, 11:16 AM IST