YS Konda Reddy: సీఎం జ‌గ‌న్ అనుచ‌రుడి అరెస్ట్

కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కొండా రెడ్డి అరెస్ట్‌ కలకలం రేపింది.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 05:13 PM IST

కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కొండా రెడ్డి అరెస్ట్‌ కలకలం రేపింది. ఎస్‌ఆర్‌కే నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మాణ పనులను వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కొండా రెడ్డి అడ్డుకుంటున్నారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రాయపేట మండలంలో పనులకు డబ్బులు డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చక్రాయపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం కొండా రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

ఎవరు బెదిరింపులకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఎస్పీ, అవినీతిపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందో చెప్పడానికి కొండారెడ్డి అరెస్టుే ఉదాహరణ అన్నారు. SRK కన్‌స్ట్రక్షన్ కర్ణాటకలోని బీజేపీ నాయకుడికి చెందినదని, కొండా రెడ్డి బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గమనించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వెంటనే కొండా రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు కాల్ డేటాను పరిశీలించి కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. కొండారెడ్డికి న్యాయస్థానం కడప జైలుకు రిమాండ్ విధించింది.