Selfie with YSR Statue: ప్రజల హృదయాలపై వైఎస్సార్ సంక్షేమ సంతకం.. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్!
పరిపాలనకు మానవత్వం జోడించిన వైఎస్సార్‌కు ఆయన అభిమానుల ఘన నివాళి..
పేదలకు ప్రాణం పోసిన ‘ఆరోగ్యశ్రీ’మంతుడుకి సామాజిక మాధ్యమాల్లో స్మరించుకున్న ఏపీ ప్రజలు..
వైఎస్ఆర్ విగ్రహాల వద్ద సెల్ఫీలు దిగిన ఆయన అభిమానులు
లెగసీ లివ్స్ ఆన్ అంటూ నినదించిన ప్రజలు
అపరభగీరథుడు, పేదల పెన్నిధి, ఎందరో పేద బిడ్డలకు విద్యా ప్రధాత, ‘ఆరోగ్య శ్రీ’ వంటి పథకాన్ని తీసుకొచ్చి అనేకమంది ప్రాణాలు నిలిపిన మహా యోథుడు అని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపరభగీరథుడిగా పిలుచుకుంటుంటారు. ఇవాళ ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీ పార్టీని పెట్టి గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. వైఎస్సార్ పాలన చూసి ఆయనకు దగ్గరైన ప్రజలు.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ కూడా పేదలకు దగ్గరయ్యేలా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అంతేకాకుండా.. జులై 8వ తేదీ వైఎస్సార్ జయంతి సందర్బంగా రాష్ట్ర రైతు దినోత్సవంగా సీఎం జగన్ ప్రకటించి.. ఏటా అనేక సేవా కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపడుతూ వస్తున్నారు. అయితే.. ఈ ఏడాది ఆ పార్టీ కేడర్ నూతన అధ్యయనానికి నాంది పలికింది. నేడు జరుగుతున్న వైఎస్సార్ జయంతి సందర్బంగా వైఎస్సార్ సీపీ సర్కార్ డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనిలో అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చింది. ‘లెగసీ లివ్స్ ఆన్’ అనే నినాదంతో వైఎస్సార్ అభిమానులకు సెల్ఫీ ఛాలెంజ్, క్విజ్ పోటీలు, ఎవరైనా.. కవితలు రాసేలా, డ్యాన్స్ చేయడం, పాట పాడటం, ఇతర ఏ ఆర్ట్‌లో వారు నైపుణ్యం ఉన్నప్పటికీ డిజిటల్‌గా వారు పాల్గొనవచ్చు.
డిజిటల్ క్యాంపెయిన్‌కు భారీగా స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెన్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా అనేకమంది యువకులు, వైఎస్సార్ అభిమానులు సెల్ఫీ విత్ వైఎస్సార్ స్టాట్ట్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ప్రాంతాల్లోఉన్న వైఎస్సార్ విగ్రహాల వద్దకు వెళ్లి సెల్ఫీ దిగి.. సామాజిక మాధ్యమాల్లో పంచకున్నారు. దీంతోపాటు.. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో జరిగిన మంచిని తెలియజేసేలా.. ఆయన హయాంలో తీసుకొచ్చిన పథకాలతో కూడిన క్విజ్ పోటీలను డిజిటల్ మాధ్యమంలో నిర్వహించగా.. అనేక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఈ క్విజ్ పోటీల్లో విద్యావంతులు పాల్గొన్నారు. దీంతోపాటు వైఎస్సార్ వేషధారణను పలువురు చిన్నారులు, పెద్దలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రాలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరికొందరు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు వైఎస్సార్ చేర్చారని, ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారని, సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
Read More: Tomato Thieves: చోరీకి గురవుతున్న టమోటా పంట ఆందోళనలో రైతులు