Site icon HashtagU Telugu

Kuppam Bandh:కుప్పంలో వైసీపీ బంద్‌

Police

Police

వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తలు బుధవారం రాళ్ల దాడికి నిరసనగా కుప్పంలో వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సెలవు ప్రకటించడంతో పాటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుప్పం పట్టణంలో పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కుప్పం చేరుకుంటున్నారు.

మరోవైపు రామకుప్పంలో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ సమాయత్తమవుతోంది. ర్యాలీలో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపారు. రామకుప్పం మండలం కొల్లుపల్లె గ్రామంలో బుధవారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో చిత్తూరు ఎస్పీ వై.రిశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం, రామకుప్పంలో అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.