Site icon HashtagU Telugu

YSRCP : వైసీపీ కి కొత్త వ్యూహకర్త .. ఈ రోజే బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

ఏపీలో అధికార పార్టీకి మ‌రో కొత్త వ్యూహ‌క‌ర్త రాబోతున్నారు. ఐ ప్యాక్ ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ నుంచి మ‌రో వ్య‌క్తిని వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకుంది. ప్ర‌శాంత్ కిషోర్ ఐ ప్యాక్‌లో ప‌ని చేస్తున్నా రిషి రాజ్ సింగ్ తో మరోసారి వైసీపీ చేతులు కలపనుందని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు (బుధవారం) తాడేపల్లిలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ అధినేత సీఎం జగన్ అధికారికంగా ఈ విషయంపై ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల పూర్తి చేసిన గడప గడపకూ ప్రభుత్వం పై సమీక్షించేందుకు వివిధ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రాంతీయ సమన్వయకర్తలు రాష్ట్ర పార్టీ నేతలతో సహా సీనియర్ నేతలందరినీ ముఖ్యమంత్రి కలవనున్నారు.