Site icon HashtagU Telugu

YSR Statue: వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు

Screen Shot 2022 01 15 At 12.16.52 Pm Imresizer

Screen Shot 2022 01 15 At 12.16.52 Pm Imresizer

సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండలం తాళ్ల కాంపాడు లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని తగుల బెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వై ఎస్సార్ టీ పీ అధికార ప్రతినిధి పిట్టా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా.

ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై వైఎస్‌ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. వివరాల్లోకి వెళితే..

జిల్లాలోని ఎస్ ఆర్ పురం మండలంలో వైయస్సార్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మండల కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైయస్ విగ్రహంపై దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు.