Site icon HashtagU Telugu

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు పై నేడు సిబిఐ కోర్టులో విచారణ

Viveka Murder

Viveka Murder Imresizer

మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ నేడు సీబీఐ కోర్టులో జ‌ర‌గ‌నుంది. ఈ కేసులో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుప‌ర‌చ‌నున్నారు. వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేశారు. సాంకేతిక తప్పుల కారణంగా గ‌తంలో ఛార్జ్ షీట్‌ని సీబీఐ కోర్టు వెన‌క్కి పంపింది. తాజాగా ఆ తప్పులు సరి చేసుకుని ఫైనల్ ఛార్జ్ షీట్ ను సీబీఐ రీసబ్మిట్ చేసింది. ఈ కేసులో నేడు నిందితులకు ఛార్జ్ షీట్ కాపీ వచ్చే అవకాశం ఉంది. గ‌త నెల 30వ తేదీన సీబీఐ ద‌ర్యాప్తు ముగిసింది. ఈ కేసులో నిందితులు ప్ర‌స్తుతం చంచ‌ల్‌గూడ జైల్‌లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి,దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి , ఉమాశంకర్ రెడ్డి , గంగి రెడ్డి, సునీల్ యాదవ్ లను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.