YSRCP : ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీకి విజ‌య‌మ్మ రాజీనామా

వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న విజ‌య‌మ్మ ఆ ప‌ద‌వితో పాటు.. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. గుంటూరులో జ‌రుగుతున్న వైసీపీ ప్లీన‌రీ వేదిక‌పై ఆమె ప్ర‌సంగించారు. ఆ స‌మ‌యంలోనే ఆమె త‌న రాజీనామాను ప్ర‌క‌టించారు. త‌న కుమారుడు జ‌గ‌న్ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అండ‌గా ఉన్నాన‌ని.. ఇక్క‌డ అధికారంలోకి పార్టీని తీసుకురావ‌డానికి కృషి చేశామ‌ని తెలిపారు. అదేవిధంగా త‌న కూతురు ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీని స్థాపించార‌ని.. ఇప్పుడు ఆమెకు మ‌ద్దతుగా నిల‌వాల‌నుకుంటున్నాన‌ని ఆమె తెలిపారు. ఇందుకోస‌మే […]

Published By: HashtagU Telugu Desk
YS Vijayamma Open Letter

YS Vijayamma Open Letter

వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న విజ‌య‌మ్మ ఆ ప‌ద‌వితో పాటు.. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. గుంటూరులో జ‌రుగుతున్న వైసీపీ ప్లీన‌రీ వేదిక‌పై ఆమె ప్ర‌సంగించారు. ఆ స‌మ‌యంలోనే ఆమె త‌న రాజీనామాను ప్ర‌క‌టించారు. త‌న కుమారుడు జ‌గ‌న్ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అండ‌గా ఉన్నాన‌ని.. ఇక్క‌డ అధికారంలోకి పార్టీని తీసుకురావ‌డానికి కృషి చేశామ‌ని తెలిపారు. అదేవిధంగా త‌న కూతురు ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీని స్థాపించార‌ని.. ఇప్పుడు ఆమెకు మ‌ద్దతుగా నిల‌వాల‌నుకుంటున్నాన‌ని ఆమె తెలిపారు. ఇందుకోస‌మే ఇక్క‌డ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విజ‌య‌మ్మ స్ప‌ష్టం చేశారు. విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

  Last Updated: 08 Jul 2022, 03:45 PM IST