Site icon HashtagU Telugu

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు విచార‌ణ‌ .. కోర్టుకు హాజ‌రైన వివేకా కూతురు సునీత‌

Viveka

Ys Sunitha Vivekananda

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ త్య‌కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాద‌వ్‌(ఏ2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (ఏ5) బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు బుధవారం విచారించనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నిందితుల తరఫున వాదనలు పూర్తయ్యాయి. బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌లు జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న కుమార్తె సునీతారెడ్డి బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. కాగా వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై విడుదలయ్యాడు. నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించామని, వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే కోర్టును కోరింది. అయితే శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గత సోమవారం వాదనలు ప్రారంభం కాగానే సునీత తరఫు న్యాయవాది వేగంగా స్పందించారు. తమ వాదనలను కూడా వినేందుకు అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు సునీత తరఫు న్యాయవాది తెలిపారు. మృతుడి కూతురిగా పిటిష‌న్‌లో ఇంప్లీడ్ అయ్యేందుకు తాను అర్హురాలినని తెలిపారు. గతంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారని, ప్రస్తుత కేసు విచారణకు అక్కడికే వెళ్లాలని కోర్టుకు సూచించారు.

Exit mobile version