Y. S. Sharmila : వైస్సార్ విగ్రహాలపై దాడుల ఫై షర్మిల ఆగ్రహం

పలు చోట్ల వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు జరిగాయి

Published By: HashtagU Telugu Desk
Ys Sharmila (3)

Ys Sharmila (3)

ఏపీలో కూటమి అధికారంలో వచ్చిన అనంతరం రాష్ట్రంలోని వైస్సార్ విగ్రహాల ఫై దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శిలాఫ­లకాలు, సచివాలయాల బోర్డుల ధ్వంసం కొనసాగుతోంది. పలు చోట్ల వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు జరిగాయి. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌లో నాడు–నేడు పథకం శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. రణరంగచౌక్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి మండలంలోని కంభంపల్లె సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల శిలాఫలకాలను, వెల్‌నెస్‌ సెంటర్‌ బోర్డును ధ్వంసం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడులకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణం అన్నారు. ఇది కేవలం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని గుడి కట్టుకున్న మహానేత వైఎస్ఆర్ అని , వైఎస్ఆర్ పేరు చెరపలేని జ్ఞాపకం అన్నారు. అలాంటి నేతకు నీచ రాజకీయాలు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు అన్నారు. వైఎస్ఆర్‌ను అవమానించే చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరారు.

Read Also : Kangana Vs Kulwinder : కంగనకు హృతిక్, ఆలియా సపోర్ట్.. ఎందుకంటే ?

  Last Updated: 09 Jun 2024, 01:42 PM IST