పార్టీ, ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ఆయన.. ఇచ్చిన హామీ మేరకు గురువారం (ఆగస్టు 4) నుంచి నేరుగా కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. మధ్యాహ్నం సభ జరగనుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, అభివృద్ధి, పటిష్టత, అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చిస్తారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
CM YS Jagan : రేపటి నుంచి కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష… కుప్పం నుంచే మొదలు..!
పార్టీ, ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్

Cm Jagan
Last Updated: 03 Aug 2022, 06:44 PM IST