Site icon HashtagU Telugu

AP CM: తాడేపల్లిలో సీఎం జగన్ సంక్రాంతి సంబురాలు!

Jagan

Jagan

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించిన సీఎం జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రతి ఇంటా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.