Site icon HashtagU Telugu

Graduate MLC Polls : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థులు ఖ‌రారు..?

Ysrcp

Ysrcp

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు పార్టీ నేతల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పోటీ చేసేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎస్‌ సుధాకర్‌ పేర్లను సీఎం జ‌గ‌న్‌ ఖరారు చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరుకు చెందిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థిగా వి.రవి బరిలోకి దిగనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థులను తర్వాత నిర్ణ‌యించ‌నున్నారు.