Site icon HashtagU Telugu

Jagan House Pattas: పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జ‌గ‌న్‌

Ys Jagan Ysrcp

Ys Jagan Ysrcp

విశాఖ‌ప‌ట్నంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డ ప‌ర్య‌టించారు. పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను ఆయ‌న పంపిణీ చేశారు. భగవంతుడి ద‌య‌తో ప్రభుత్వం నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సీఎం జ‌గ‌న్ అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక సెంటు భూమి ఇస్తూ ఒకే కాలనీలో 10,228 ఇళ్లు నిర్మిస్తున్నామని.. వీటికి రూ. 6 లక్షలు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో 16 నెలల క్రితమే ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమం వాయిదా ప‌డిందిని సీఎం జ‌గ‌న్ తెలిపారు. 1.23 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే తన లక్ష్యమని వైఎస్‌ జగన్ తెలిపారు. 30,70,000 మందికి ఇళ్లు మంజూరు చేశామమ‌ని.. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రానున్నాయని తెలిపారు. రెండో దశ నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి మొత్తం రూ. భూములకు 35 కోట్లతో 55000 కోట్లు, సౌకర్యాలు కల్పించేందుకు 32,000 కోట్లు కేటాయించ‌మ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.