Site icon HashtagU Telugu

YS Jagan: హర్యానా ముఖ్యమంత్రి తో జగన్ భేటీ

Jagan

Jagan

విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సీఎం జగన్‌ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆయన వెంట ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీకి దేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ అత్యంత సన్నిహితుడు.దీంతో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీ జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖపట్టణం అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు భారీ ఎత్తున చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూసుకోవడం జరిగింది.