ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన దీనా అనే యువకుడు హైదరాబాద్‌లోని సైఫాబాద్ క్రాంతినగర్‌లో దాదాపు పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. తండ్రి చంద్రశేఖర్ రైల్వేలో, తల్లి డిఫెన్స్‌లో పనిచేస్తున్నారు. అయితే సోమవారం దీనా వారి అపార్ట్‌మెంట్ పై నుంచి కిందకు దూకాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనా ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతను యూట్యూబ్‌లో సెల్ఫ్లో అనే గేమ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ ఛానెల్‌కు ఎక్కువ మంది వీక్షకులు రావడం లేదని ఆయన వాపోయారు. గురువారం ఉదయం యూట్యూబ్ లైవ్‌లో గేమ్ ఆడిన దీనా.. తన బాధను వీక్షకులకు చెబుతూనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనా ఆత్మహత్య చేసుకోవడానికి 8 గంటల ముందు యూట్యూబ్‌లో సూసైడ్ నోట్‌ను అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Young Man Sucide : తన వీడియోకి వ్యూస్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన దీనా

Student's suicide at Tirumala school... Here is the actual truth...
Last Updated: 21 Jul 2022, 04:24 PM IST