YouTube Streaming App: త్వరలోనే యూట్యూబ్’లో ‘ఛానెల్ స్టోర్’ ఫీచర్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

ప్రముఖ ఎంటర్టైన్మెంట్, వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ యాప్ ని నిత్యం

  • Written By:
  • Publish Date - August 14, 2022 / 01:00 PM IST

ప్రముఖ ఎంటర్టైన్మెంట్, వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ యాప్ ని నిత్యం కోట్లాదిమంది వినియోగదారులు ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే యూట్యూబ్ సంస్థ వాళ్ళు వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. యూట్యూబ్ సంస్థ వారు తాజాగా మరొక సరికొత్త ఫీచర్ ని లాంచ్ చేయబోతున్నారు.

అయితే ఎప్పటికప్పుడు కీలక అప్డేట్స్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబ్ అతి త్వరలోనే యూట్యూబ్ స్ట్రీమింగ్ వీడియో సర్వీస్ ను ప్రారంభించాలని ఆలోచిస్తోందట. అందుకు అనుగుణంగా ప్లాన్లు కూడా చేస్తోందట. ఇందుకోసం పలు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలతో కంపెనీ చర్చలను మళ్లీ ప్రారంభించిందని సమాచారం. స్ట్రీమింగ్ వీడియో సేవల కోసం ఆల్ఫాబెట్‌కు చెందిన యూట్యూబ్ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది.

కాగా గత 18 నెలలుగా పనిలో ఉన్న సంస్థ పలు సంస్థలతో చర్చలను పునరుద్ధరించిందని తెలిపింది. ఛానల్ స్టోర్ పేరుతో పిలుస్తున్న ఈ చర్చలు పూర్తైన తరువాత ఈ సర్వీసు అందుబాటులోకి రావచ్చని తెలిపింది. అయితే ఈ వారం ప్రారంభంలో, వాల్‌మార్ట్ తన సభ్యత్వ సేవలో స్ట్రీమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేర్చడం గురించి మీడియా కంపెనీలతో చర్చలు జరిపిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.