YouTube Live Ring:యూట్యూబ్ నుంచి లేటెస్ట్ అప్ డేట్..టిక్ టాక్ మాదిరిగానే..!!!

గూగుల్ కు చెందిన యూట్యూబ్ మరోసరికొత్త ఫీచర్ ను యూజర్స్ కు అందుబాటులోకి తీసుకురానుంది.

  • Written By:
  • Updated On - February 23, 2022 / 07:58 AM IST

గూగుల్ కు చెందిన యూట్యూబ్ మరోసరికొత్త ఫీచర్ ను యూజర్స్ కు అందుబాటులోకి తీసుకురానుంది. ఇతర వీడియోస్ట్రీమింగ్, షేరింగ్ ప్లాట్ ఫాంలకు పోటీగా కొత్త అప్ డేట్స్ అందిస్తోంది. లేటెస్టుగా టిక్ టాక్ మాదిరిగానే లైవ్ రింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్ లో టిక్ టాక్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబ్ లోని షార్ట్ వీడియోస్ ఫీచర్ ను యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలామంది టిక్ టాక్ యూజర్లు యూట్యూబ్ లో ఛానెల్ ఓపెన్ చేశారనే చెప్పవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల లైవ్ స్ట్రిమింగ్ ను సూచించే విధంగా ప్రత్యేక ఇండికేటర్ ను తీసుకువస్తున్నట్లు యూట్యూబ్ నిర్వాహకులు వెల్లడించారు.

ఇక కొత్తగా అలరించనున్న యూట్యూబ్ ఫీచర్ ద్వారాలైవ్ కంటెంట్ ను యూజర్లు ఈజీగా గుర్తించవచ్చు. ఛానెల్ నిర్వాహకులు లైవ్ లో ఉన్నారని తెలిసే విధంగా వారి ప్రొఫైల్ పిక్చర్ వద్ద లైవ్ అనే రింగ్ కనిపిస్తుంది. దీని ద్వారా లైవ్ స్ట్రీమ్ లోకి వెళ్లి ఛానెల్ నిర్వాహకులతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక దీనికి సంబంధి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మోహన్ మాట్లాడారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ ను యూజర్స్ ఈజీగా గుర్తించే విధంగా ద్రుష్టి పెట్టాం.

వీలైనంత తొందరగా యూజర్లకు ప్రత్యేక ఫీచర్ ను అందించాలన్న ఉద్దేశ్యంతో పనిచేశాం. ప్రస్తుతం మొబైల్ యూట్యూబ్ వినియోగిస్తున్న సమయంలో లైవ్ స్ట్రీమింగ్ సూచించేలా లైవ్ రింగ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇక యూట్యూబ్ క్రియేటర్స్ ఛానెల్ ప్రొఫైల్ పిక్చర్ పక్కనలైవ్ రింగ్ ను చూస్తారు. దానిపై క్లిక్ చేస్తే డైరెక్టుగా లైవ్ స్ట్రీమ్ ఓపెన్ అవుతుందని వివరించారు.
అయితే ఇప్పటివరకు ఇలాంటి ఆప్షన్ టిక్ టాక్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఛానెల్ ప్రొఫైర్ పిక్చర్ దగ్గ పల్సింగ్ రింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.

ఆ రింగ్ కనిపించినట్లయితే ఆ ఛానెల్ వ్యక్తి లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్నట్లని అర్దం. అదేవిధంగా ఐఫోన్, ఐప్యాడ్ లలో పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్ ను యూట్యూబ్ టీవీ ఇప్పటికే అందిస్తోంది. ఈ సదుపాయం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్లకు మాత్రం పిక్చర్ ఇన్ పిక్చర్ సదుపాయం కోసం వేచిచూడాల్సి వస్తోంది.