ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కేంద్ర మంత్రి (Minister Kaushal Kishore) కొత్త ఇంట్లో కాల్పుల మోతమోగింది. మంత్రి కుమారుడు వికాస్ (Vikas) లైసెన్స్ డ్ గన్ తో ఓ యువకుడ్ని కాల్చారు. శుక్రవారం తెల్లవారు జామున 4.15 గంటలకు బెగారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మంత్రి కుమారుడి స్నేహితుడు ఒకరు పార్టీ కోసం అని వినయ్ శ్రీవాస్తవ్ (30) (Vinay Srivastava) ను పిలిచారు. అయితే పార్టీ జరుగుతుండగా మధ్యలో శ్రీవాస్తవను తలలో కాల్చి చంపారు. మృతి చెందిన యువకుడిని కౌషల్ కిషోర్ తనయుడు అషూ అలియాస్ వికాస్ స్నేహితుడిగా గుర్తించారు. అయితే చంపడానికి ఉపయోగించిన గన్ మంత్రి కుమారుడు అషు లైసెన్స్డ్ రివాల్వర్ గా తేల్చారు పోలీసులు. అయితే హత్య జరిగిన సమయంలో మంత్రి తన ఇంట్లోనే ఉన్నారు. వెంటనే ఆయన పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గన్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. యువకుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ (Rahul Raj ) తెలిపారు.
హత్యానంతరం కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ (Minister Kaushal Kishore) మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉన్నామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తన కుమారుడు వికాస్ కూడా ఆ సమయంలో ఇంట్లో లేడని, అతడి భార్య ఢిల్లీలో ఉంటుందని, ఆమె ఆరోగ్యం పాడైతే ఆసుపత్రిలో చేరిందని తెలిపారు మంత్రి. కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ హత్యకు కుట్ర పన్నాడని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు.
Read Also : Virat Kohli- Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్- కోహ్లీ జంట.. 2 పరుగులు చేస్తే చాలు..!
మృతుడి సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడు ఎప్పుడూ మంత్రి కుమారుడితోనే ఉండేవాడని .. అతను అతని రైడ్ హ్యాండ్ అని అన్నాడు. నా సోదరుడు ఎప్పుడూ వికాస్ కిషోర్‌తో కలిసి ఉండేవాడు. రోజూ రాత్రి ఆలస్యంగా వచ్చేవాడు. గురువారం రాత్రి రావడానికి ఆలస్యం కావడంతో.. తాము అతనికి ఫోన్ చేసాం. అనంతరం మంత్రి ఇంటికి చేరుకుని చూడగా ఆయన చొక్కా బటన్‌లు ఉడిపోయి.. గుడ్డలు చిరిగిపోయి.. రక్తం మడుగులో పడి ఉన్నాడు. అక్కడే పోలీసులకు కాల్చిన రివాల్వర్ బుల్లెట్ కూడా లభ్యమైందన్నారు. వికాస్ కిషోర్ వద్ద లైసెన్స్ రివాల్వర్ ఉందని ఆరోపించారు. ఘటనా స్థలంలో ఉన్న అంకిత్, సమీమ్, అజయ్ ఆత్మహత్యగా అభివర్ణించారని.. అయితే అక్కడి పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదన్నారు. నా సోదరుడు హత్యకు గురయ్యాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలి. తమ్ముడిని చంపిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని డిమాండ్ చేశారు.
