Youth Suicide: ఉద్యోగం రాలేదని నిరాశతో యువకుడు సూసైడ్

యువకుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఏదైనప్పటికీ నీటి యువత ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

Youth Suicide: యువకుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఏదైనప్పటికీ నీటి యువత ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఎర్నాకులం అలువాలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అలువాకు చెందిన అజ్మల్ అనే వ్యక్తి ఉరివేసుకుని తనువు చాలించాడు. విదేశాలకు వెళ్లినా ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి 10 నిమిషాల ముందు అజ్మల్ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంటి పైనున్న గదిలో అజ్మల్ ఉరి వేసుకుని కనిపించాడు. అజ్మల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటన నిన్న సాయంత్రం 6:30 గంటలకు జరిగింది. RIP అజ్మల్ షరీఫ్ (1995-2023) అని తన ఫోటో పెట్టి షేర్ చేసిన తర్వాత అతను హ్యాత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో దుబాయ్ వెళ్లిన అజ్మల్ ఉద్యోగం రాకపోవడంతో తిరిగి దేశానికి వచ్చాడు. దీంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

Also Read: Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన రేవంత్ సర్కార్