Site icon HashtagU Telugu

Nail Shape Personality Test: అదేంటి.. గోళ్ళ ఆకారాన్ని బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చా?

Nail Shape Personality Test

Nail Shape Personality Test

మీ గొర్ల ఆకృతి ద్వారా మీ వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరి ఎటువంటి గోర్లు కలిగిన వాళ్ళు ఏ స్వభావాలు ఏ లక్షణాలను కలిగి ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా గోర్లు నాలుగు రకాలుగా విభజించారు. అవి పొడవాటి గోర్లు, గుండ్రటి గోర్లు, చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకార గోర్లుగా విభజించారు.

నిలువుగా పొడవాటి గోర్లు ఉంటే… ఇలాంటి గోర్లు ఉన్నవారు సృజనాత్మకంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధికలవారై ఉంటారు. అలాగే వీరికి అవసరాన్ని బట్టి హేతుబద్ధంగా ఆలోచిస్తారు. తమ సృజనాత్మక ధోరణితో సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతారు. చాలా సున్నితంగా ఉంటారు. ఎక్కువగా నిరుత్సాహానికి గురవ్వుతుంటారు. దీంతో అక్కడే చతికిలపడిపోతారు. తిరిగి నూతనోత్సాహాంతో యథాస్థితికి రావటానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఊహించని సవాళ్లను ఎదుర్కొనే సమయంలో నిరుత్సాహపడిపోతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణలో ఉండేదుకు యత్నించి నిరుత్సాహన్ని అధిగమించే యత్నం చేస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు.

దీర్ఘచతురస్రాకార గోర్లు… ఉన్నవారు ఓపెన్‌ మైండెడ్‌ గా ఉంటారు. మంచి నమ్మకస్తులుగా కూడా. భాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి ఆత్మ విశ్వాసం కూడా మెండుగా ఉంటుంది. వీరు అవతలి వాళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నపటికీ తన మనసులో మాటను చెప్పడానికి భయపడరు. గొప్ప సంభాషణ చతురత వీరికి మంచి ప్లస్‌ పాయింట్‌గా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవారై ఉంటారు. అందరితోనూ మంచి సంబంధాలను నెరపగల నేర్పరి కూడా.

గుండ్రటి గోళ్లు.. ఉన్నవారు అంత తేలికగా కంగారు పడరు. ఒత్తిడికి గురికారు కూడా. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరిస్తారు. వీరికి ప్రశ్నించే గుణం ఎక్కువగా ఉంటుంది. కొత్త సమాచారం కోస వెతుకుతూ ఉంటారు. గొప్ప అభ్యాసకులుగా ఉంటారు. ఎదురు దెబ్బలు తట్టుకొని పుంజుకుని నిలబడగల సామర్థ్యంతో ఉంటారు. వీరు చాలా ఆశావాదులు. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందర్నీ ఆదరించే స్వభావం కారణంగా ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలరు.

చతురస్రాకార గోళ్లు… ఉన్నవారు చాలా స్వతంత్రంగా ఉంటారు. ఇతరులు ఏమి చేయాలో చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వినూత్న మార్గంలో పనిచేయడానకి ఇష్టపడతుంటారు. రిస్క్‌ తీసుకోవడానికి భయపడరు. సాహసం అంటే ఇష్టపడే వీరు ఎల్లప్పుడూ కొత్తవాటి కోసం అన్వేషిస్తూ కొత్త కొత్త ప్రదేశాలను తరుచుగా సందర్శిస్తుంటారు. లక్ష్యం కోసం ఎంత శ్రమననై ఓర్చకుని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కొవడంలో దృఢంగా ఉంటారు. గొప్ప నాయకుడిగా ఉంటారు.