హైదరాబాద్ మాదాపూర్‌లో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో జరిగిన తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.కిషోర్‌రాజు (30) అనే వ్యక్తి వెళ్లాడు. అయితే ఆ తరువాత అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన ప్రేమ విషయంలో మనస్తాపం చెంది, మద్యం మత్తులో ఉన్న రాజు భవనంలోని ఐదవ అంతస్తు నుండి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. రాజుని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad : ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Death Representative Pti