Andhra Pradesh : చంద్ర‌బాబు అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా విమానంలో నిర‌స‌న చేసిన యువ‌కుడు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నం వెళ్లే విమానంలోనే

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 11:25 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నం వెళ్లే విమానంలోనే టీడీపీ కార్యకర్త ఆడారి కిషోర్‌కుమార్‌ విమానంలోనే నిరసనకు దిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కిషోర్‌ కుమార్ ‘సేవ్ డెమోక్రసీ’ బ్యానర్‌ను పట్టుకుని విమానంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు అయితే ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 23 వరకు 14 రోజులపాటు ఆదివారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర పోలీసులు చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌తో సహా పలువురు పార్టీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు, జ్యుడీషియల్ కస్టడీకి వ్యతిరేకంగా తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా నిరసనలు జరిగాయి.