Site icon HashtagU Telugu

Heart Stroke : వాకింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన యువ‌కుడు

Heart Attack

Heart Attack

విజ‌య‌న‌గ‌రం జిల్లా మొగిలివ‌ర‌స‌లో విషాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో ఓ యువకుడు మరణించాడు. రాజాం మండలం మొగిలివలసలో శ్రీహరి ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. ఇది గ‌మ‌నించిన స్థానికులు రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ యువకుడు ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. జిమ్ చేస్తున్న‌ప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా వారి రోజువారీ పనులకు హాజరవుతున్నప్పుడు యువకులు ఆకస్మిక గుండెపోటుకు గురయ్యే అనేక సంఘటనలు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. జులై 10న తెలంగాణలోని ఖమ్మం పట్టణంలోని జిమ్‌లో వర్కవుట్ చేసిన ఓ యువకుడు హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. జూలై 8న అదే పట్టణంలో గుండెపోటుతో 33 ఏళ్ల వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.