Site icon HashtagU Telugu

Viral Video: చీతాను ముద్దాడుతున్న మహిళ.. ధైర్యానికి మెచ్చుకుంటున్న నెటిజెన్స్?

Viral Video

Viral Video

సాధారణంగా సింహం,పులి,చిరుత,చీతా ఇటువంటి భయంకరమైన జంతువులను చూశారు అంటే చాలు భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఈ జంతువులు మాంసాహారాలు కావడంతో కనిపించినా జంతువును వేటాడి మరీ చంపి తింటాయి. ఈ జంతువుల కంటే పడ్డ ఏ జంతువు అయినా వాటికి ఆహారం కావాల్సిందే. ఎంతో బలమున్న జంతువులు కూడా వీటికి ఆహారం అవుతూ ఉంటాయి. అటువంటిది మనిషి ఆ క్రూర మృగాల కంటపడ్డాయి అంటే ఇక అంతే సంగతులు.

వాటి పేర్లు వింటేనే కొంతమంది భయపడిపోతూ ఉంటారు. వాటిని దగ్గరనుంచి చూడాలి అన్నా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. అయితే అలా భయంకరమైన జంతువులలో చీతా కూడా ఒకటి అని చెప్పవచ్చు. వాటిని జూలలో చూడడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. అటువంటిది పక్కన వెళుతున్నట్టుగా ఊహించుకుంటేనే ఒళ్ళు మొత్తం జల్దరీస్తుంది. కానీ ఈ వీడియోలో ఒక మహిళ మాత్రం ఏకంగా చీతాను ముద్దాడుతోంది.

 

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ పక్కనే చీతా ఉంది. కానీ ఆ మహిళ చీతాను చూసి ఏమాత్రం భయపడకుండా దానికి ముద్దులు ఇచ్చి మురిపించింది. అయితే ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ మహిళ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. మరి కొందరు ఆ మహిళపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version