Site icon HashtagU Telugu

GirlFriend for Rent: ఇచ్చట అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ లభించును.. ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chinecover

Chinecover

GirlFriend for Rent: ఇక్కడ అద్దెకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతారు. వినడానికి చాలా ఎగ్జైట్‌గా ఉంది కదూ ఇప్పుడు ఈ ఆఫర్‌ చాలా ట్రెండింగ్‌గా మారింది. అయితే ఇది మన ఇండియాలో కాదండి. మన పక్క దేశమైన చైనాలో ఇప్పుడు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇవ్వడం ట్రెండ్‌గా మారిపోయింది. ప్రేయసి లేని యువకులు వీకెండ్స్‌, హాలీ డేస్‌ టైమ్‌లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌ను రెంట్‌కు తీసుకెళ్లడం ఇప్పుడు డ్రాగన్‌ దేశంలో ఎక్కువైపోంది.

అమ్మాయిలు కావాలంటే రెంట్‌కు ఇస్తున్నారని దీనికోసం పలు వెబ్‌సైట్స్‌ కూడా ఉన్నాయని తెలిసిన ఓ రిపోర్టర్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టాడు. చైనాలోని నాజియాంగ్‌కు చెందిన సదరు రిపోర్టర్‌ తనకు తెలిసిన ఒక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి తనకు గర్ల్‌ఫ్రెండ్‌ కావాలని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చిన కొద్దిరోజులకే అతనికి ఒక యువతి నుంచి ఫోన్‌ వచ్చింది. అతను ఇచ్చిన ప్రకటన చూశానని అతనికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు సిద్ధమేనని చెప్పింది.

ఇందుకోసం రోజుకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టింది. దీనికి అతను అంగీకరించడంతో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి నుంచి పలు ఆసక్తికర విషయాలు రాబట్టాడు. ప్రస్తుతం తాను డిగ్రీ చదువుతున్నానని ఖాళీ సమయాల్లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌గా రెంట్‌కు వెళ్తున్నానని చెప్పింది. దీనివల్ల నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తున్నానని ఆ యువతి చెప్పింది.నార్మల్‌ డేస్‌ కంటే కూడా వీకెండ్స్‌, హాలీ డేస్‌లో ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారంది.

చైనాకు చెందిన యువతీయువకులు ఇప్పుడు పెండ్లి,పిల్లల కంటే కూడా ఎక్కువగా జీవితంలో సెటిల్‌ అవ్వాలనే చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో చేరి తనకంటూ ఆస్తిపాస్తులు సంపాదించుకునే దాకా వాటిపై ధ్యాస పెట్టడం లేదు. పెండ్లి చేసుకోకపోవడమే కాదు కదా కనీసం లవ్‌ చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇలా రెంట్‌కు అమ్మాయిని తీసుకుని ఆమెను తమ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేస్తున్నారు.అయితే యువకుల నుంచి డిమాండ్‌ ఎక్కువ కావడంతో ఈ బిజినెస్‌ గురించి చాలామందికి తెలిసిపోయింది.

Exit mobile version