ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ (PAN Card) అనేవి రెండు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలు. బ్యాంకు లావాదేవీల్లోనూ ఇవి ఎంతో కీలకం. భారత ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం తన పౌరులందరూ వారి పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన గడువును చాలాసార్లు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత ఇక ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మార్చి 2023 చివరి నాటికి తమ ఆధార్‌తో ఇంకా లింక్ చేయని శాశ్వత ఖాతా నంబర్‌లు (పాన్) “పనిచేయనివి” గా పరిగణించబడతాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ డిసెంబర్ 24న ప్రకటించింది.
ఐటీ శాఖ తాజా ప్రకటనలో:
“ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం మినహాయింపు వర్గం కిందకు రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను మార్చి 31, 2023లోపు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఏప్రిల్ 1, 2023 నుండి, అన్ లింక్ చేయబడిన PAN Card పనిచేయదు. అందుకే ఇది తప్పనిసరి. ఆలస్యం చేయవద్దు, ఈ రోజే లింక్ చేయండి!” అని కోరింది. వాస్తవానికి పాన్-ఆధార్ అనుసంధానానికి సంబంధించిన గడువు 2020 మార్చి 31తోనే ముగిసింది. కానీ ఆ తర్వాత గడువును 2023 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
CBDT ఏం చెప్పింది?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) సంస్థ ఆదాయపు పన్ను శాఖ కోసం పాలసీలను రూపకల్పన చేస్తుంటుంది.అది జారీ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం.. “మార్చి 30న ఒకసారి పాన్ పనిచేయకపోతే.. IT చట్టం ప్రకారం అన్ని పరిణామాలకు ఆ పాన్ కలిగిన వ్యక్తి బాధ్యత వహిస్తాడు. పాన్ లేకపోతే IT రిటర్న్‌లను ఫైల్ చేయలేరు. ఇంకా ఎన్నో ఆర్ధిక వ్యవహారాలను చేయలేరు.”
ఈ రూల్ ఎవరికి వర్తించదు?
2017 మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. “మినహాయింపు వర్గం” లో అస్సాం, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు మేఘాలయ రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు ఉంటారు. వారు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్‌లుగా పరిగణించబడతారు. మునుపటి సంవత్సరంలో ఏ సమయంలోనైనా 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరియు భారతీయ పౌరులు కాని వారు.
Also Read: Tirupati : తిరుపతి లో జనవరి ఒకటిన వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనం కౌంటర్లు